GIS 2023: అతిథులకు ఆంధ్రా రుచులు 

Andhra food for guests - Sakshi

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు హాజరయ్యే వారి కోసం ప్రత్యేక వంటకాలు 

బొమ్మిడాయిల పులుసు,  గుంటూరు కోడికూర, రొయ్యల మసాలా 

ఉలవచారు.. మజ్జిగ పులుసు 

ద్రాక్ష పచ్చడి.. జున్ను 

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)కు దేశ, విదేశాల నుంచి వచ్చే అతిథుల కోసం నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాల వెజ్, నాన్‌వెజ్‌ రుచులను వీరికి అందించనున్నారు.

తొలిరోజు శుక్రవారం మధ్యాహ్నం భోజనంలో బొమ్మిడాయిల పులుసు, గుంటూరు కోడి వేపుడు, రొయ్యల మసాలా, మటన్‌ కర్రీ, చికెన్‌ పలావ్, వెజ్‌ రకాల్లో మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్‌ ఫ్రై, కేబేజీ మటర్‌ ఫ్రై, వెజ్‌ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్‌ బటర్‌ మసాలా, మెంతికూర–కార్న్‌ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్‌రూట్‌ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పండ్ల పచ్చడి, చల్ల మిర్చి ఉంటాయి. అలాగే కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, పేస్ట్రీ, కాలా జామున్, జున్ను చంద్రకాంతలు సిద్ధం చేస్తున్నారు.  

రెండో రోజూ విశేషంగానే.. 
రెండో రోజు శనివారం లంచ్‌లో రష్యన్‌ సలాడ్స్, వెజ్‌ సలాడ్‌లతో పాటు రుమాలి రోటీ, బటర్‌ నాన్‌ ఇస్తారు. నాన్‌ వెజ్‌ రకాల్లో ఆంధ్రా చికెన్‌ కర్రీ, చేప ఫ్రై, గోంగూర, రొయ్యల కూర, ఎగ్‌ మసాలా, మటన్‌ పలావ్‌.. వెజ్‌ ఐటమ్స్‌లో వెజ్‌ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీరు కూర, క్యారెట్‌ బీన్స్‌ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు–క్రీం వంటివి ఉన్నాయి. ఇంకా కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, బ్రౌనీ, గులాబ్‌జామ్, అంగూర్‌ బాసుంది, డబుల్‌కా మీఠా ఇస్తారు. ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమా­టా బాత్, హాట్‌ పొంగల్, ఉదయం స్నాక్స్‌­లో ప్లమ్‌ కేక్, డ్రై కేక్, వెజ్‌ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్‌ రోల్స్, సాయంత్రం స్నాక్స్‌లో కుకీస్, చీజ్‌ బాల్స్, డ్రై ఫ్రూట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, కట్‌ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ ఉంటాయి.   
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top