ఆరో రోజూ ఆగిన ఆరోగ్యశ్రీ | Aarogya Sri Aervices Stopped for Sixth Day in ap | Sakshi
Sakshi News home page

ఆరో రోజూ ఆగిన ఆరోగ్యశ్రీ

Apr 7 2026 6:03 AM | Updated on Apr 7 2026 6:03 AM

Aarogya Sri Aervices Stopped for Sixth Day in ap

విజయవాడలోని ఓ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు నిలిచిపోవడంతో బోసిపోయిన సేవాకేంద్రం, సేవలు నిలిచిపోవడంతో విలపిస్తున్న రోగులు

వైద్యం అందక పేద రోగులు విలవిల

సాక్షి, అమరావతి: ఆరోగ్యశ్రీ కింద రాష్ట్రంలోని ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరో రోజు సోమవారం కూడా ఉచిత వైద్య సేవలు నిలిచిపోయాయి. దీంతో పేద రోగులు విలవిలలాడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో నెట్‌వర్క్‌ ఆస్పత్రులు ఈ నెల ఒకటో తేదీ నుంచి సమ్మెబాట పట్టిన విషయం తెలిసిందే. సోమవారం మరోసారి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌(ఆశా)తో ప్రభుత్వం చర్చలు జరిపింది. ప్రభుత్వం తరఫున వైద్యశాఖ కార్యదర్శి సౌరభ్‌ గౌర్, ఆర్థికశాఖ అధికారులు చర్చల్లో పాల్గొన్నారు. సమ్మె ప్రారంభించిన తొలి రోజు చేసిన ప్రతిపాదనలనే మళ్లీ ప్రభుత్వం చేసింది.

రూ.1,000 కోట్ల మేర బకాయిలు విడుదల చేస్తామని, కొత్తగా ప్రవేశపెట్టే బీమా విధానం రూపకల్పనలో నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు భాగస్వామ్యం కలి్పంచడంతోపాటు ఇతర అంశాల పరిష్కారానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ హామీలన్నింటినీ రాతపూర్వకంగా ఇస్తేనే సమ్మె విరమిస్తామని ఆశా ప్రతినిధులు తేల్చి చెప్పారు. దీంతో చర్చల మీటింగ్‌ మినిట్స్‌ను రాతపూర్వకంగా అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచి్చందని ఆశా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ప్రకటించారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకుంటే సమ్మె విరమణపై తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement