సామాజిక సేవలపై.. పెరిగిన మూలధన, రెవెన్యూ వ్యయం

సామాజిక సేవలపై మూలధన వ్యయం 22.31 శాతం.. రెవెన్యూ వ్యయం 4.93 శాతం పెరుగుదల
రాష్ట్ర రెవెన్యూ రాబడి 28.53 శాతం వృద్ధి
రాష్ట్ర సొంత పన్నుల రాబడి 23.64 శాతం..
సొంత పన్నేతర ఆదాయం 47.78 శాతం పెరుగుదల
కేంద్రం నుంచి పన్నుల వాటాతో పాటు గ్రాంట్లు రాబడి కూడా..
2021–22 ఆర్థిక ఏడాదికి సంబంధించి కాగ్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి : 2020–21తో పోలిస్తే 2021–22 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సేవలపై మూల ధన వ్యయంతో పాటు రెవెన్యూ వ్యయం కూడా పెరిగిందని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక తెలిపింది. 2021–22కి సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కాగ్ ఇచ్చిన నివేదికను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శుక్రవారం అసెంబ్లీకి సమర్పించారు.
సామాజిక సేవలపై 2021–22లో 42.45 శాతం వ్యయం చేసినట్లు పేర్కొంది. ఇందులో ప్రధానంగా విద్య, ఆరోగ్య.. కుటుంబ సంక్షేమం, ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమం, సాంఘిక సంక్షేమం, పోషణ, క్రీడలు, కళలకు రూ.66,371 కోట్లు వ్యయం చేసినట్లు పేర్కొంది. సామాజిక సేవలపై సాధారణ రాష్ట్రాల సగటు వ్యయం కన్నా ఏపీలో ఎక్కువగా ఉంది.ఇక సామాజిక సేవలపై రాష్ట్రాల సగటు వ్యయం 38.31 శాతం ఉండగా ఏపీలో 42.45 శాతం ఉంది.
మరిన్ని వార్తలు :