అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్‌ | 20 More Accused Arrested in Amalapuram Incident Case | Sakshi
Sakshi News home page

అమలాపురం అల్లర్లు: మరో 20 మంది అరెస్ట్‌

Jun 2 2022 7:51 PM | Updated on Jun 2 2022 7:54 PM

 20 More Accused Arrested in Amalapuram Incident Case - Sakshi

సాక్షి, కోనసీమ: కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో జరిగిన అల్లర్లు, విధ్వంసానికి సంబంధించిన కేసుల్లో మరో 20 మంది నిందితులను గురువారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో మొత్తం అరెస్ట్‌లు 91కి చేరుకున్నాయి. నిందితుల ఒప్పుకోలు, సహ నిందితుల వాంగ్మూలం, వీడియోలు, సిసి టివి పుటేజ్, టవర్ లొకేషన్,  సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ కేఎస్‌ఎస్‌వీ సుబ్బారెడ్డి తెలిపారు. అమలాపురం ఘటనలకు సంబంధించి మొత్తం ఏడు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామన్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. 

చదవండి: (నాణ్య‌మైన వైద్యం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం: మంత్రి విడదల రజిని)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement