బీసీ గురుకులాలకు 130 గెస్ట్‌ టీచర్‌ పోస్టులు | 130 Guest Teacher Posts Recruitment in BC Gurukuls: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బీసీ గురుకులాలకు 130 గెస్ట్‌ టీచర్‌ పోస్టులు

Jun 24 2025 4:18 AM | Updated on Jun 24 2025 4:18 AM

130 Guest Teacher Posts Recruitment in BC Gurukuls: Andhra Pradesh

బీవోజీ సమావేశంలో నిర్ణయం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని 65 బీసీ గురుకులాల్లో రెండు చొప్పున మొత్తం 130 గెస్ట్‌ టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(ఎంజేపీబీసీడబ్ల్యూఆర్‌ఈఎస్‌) బోర్డ్‌ ఆఫ్‌ గవర్నెన్స్‌(బీవోజీ) సమావేశం నిర్ణయించింది. సోమవారం బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌.సవిత అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

715 మంది ఉద్యోగులను పర్మినెంట్‌ చేసే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉమ్మడి 13 జిల్లాల్లో డిస్ట్రిక్ట్‌ కో–ఆర్డీనేటర్‌ పోస్టుల భర్తీకి, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్‌ వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపారు. గురుకులాల్లో విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.3 లక్షల నష్టపరిహారంతోపాటు దహన సంస్కారాలకు రూ.10 వేలు అందించేందుకు నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement