అదుపు తప్పిన పైపుల లారీ | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పిన పైపుల లారీ

Jul 3 2026 2:10 AM | Updated on Jul 3 2026 2:10 AM

ఆత్మకూరు: మండల పరిధిలోని వడ్డుపల్లి టోల్‌ప్లాజా వద్ద గురువారం తెల్లవారుజామున పైపులు తీసుకెళ్లే ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. పంపనూరు సిటీ పార్కు నుంచి వడ్డుపల్లి టోల్‌ ప్లాజ్‌ వద్ద వరకు తగ్గు ఉండటంతో ఎక్కువగా వాహన డ్రైవర్లు న్యూట్రల్‌ చేస్తుండటంతో కంట్రోల్‌ చేసుకోలేక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. కొంచెం ముందుకు వెళ్లి ఉంటే టోల్‌ప్లాజా వద్ద ఉన్న రూమ్స్‌కు లారీ తగిలేదని టోల్‌ప్లాజ్‌ సిబ్బంది తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement