అనంతపురం: రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి ..ఆటవిక రాజ్యాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్ విమర్శించారు. వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గాదే సాయికృష్ణ, క్రాంతి కుమార్, గంగమ్మ మరణాలకు కారణమైన వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దమన కాండకు నిరసనగా వైఎస్సార్‌సీపీ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు జిల్లా పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం దగ్గర సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యవాదులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శి సాకే రామాంజనేయులు, ఎస్సీ సెల్ నార్పల మండలాధ్యక్షుడు ప్రభుదాస్ , బుక్కరాయసముద్రం మండలాధ్యక్షుడు బండారు మారుతి, గార్లదిన్నె మండలాధ్యక్షుడు నారాయణస్వామి, ఆదినారాయణ, రమేష్, ఆనంద్ పాల్గొన్నారు.


