కణేకల్లు: ప్రజల ఆరాధ్య దైవం చిక్కణ్ణేశ్వరస్వామి రథోత్సవం కణేకల్లులో శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. వేడుకలను తిలకించేందుకు రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాలతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. తొలుత పల్లకీలో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొచ్చి.. రథంలో కొలువుదీర్చి మడుగు తేరు లాగారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో భక్తులు హరహర మహాదేవ.. శంభో శంకర అంటూ శివ నామాన్ని స్మరిస్తూ రథాన్ని ముందుకు లాగారు.


