● తొలిసారి విశ్రాంత ఉద్యోగికి అవకాశం
అనంతపురం
సెంట్రల్: హంద్రీ–నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ప్రాజెక్టు సీఈగా నాగరాజ మళ్లీ నియమితులయ్యారు. తొలిసారి విశ్రాంత ఉద్యోగి ఉన్నతాధికారి స్థానంలో కొనసాగనున్నారు. ఈ విషయంపై గత నెల 10న ‘సాక్షి’లో ‘ఆయనే కావాలి’ శీర్షికన కథనం వెలువడింది. అనుకున్న విధంగానే ఏడాదిపాటు ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ (కాంట్రాక్టు పద్ధతిలో) ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఏడాది జనవరి 30న సీఈ నాగరాజ ఉద్యోగ విరమణ పొందారు. అయితే తన సర్వీసును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.వేల కోట్లతో హంద్రీ–నీవా లైనింగ్‌పనులు చేపట్టారు. దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయనే ఉంటే బిల్లుల మంజూరుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో కొంతమంది మంత్రి, ఎమ్మెల్యేల ద్వారా సిఫార్సు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేతల అండదండలు ఉండడంతో తొలిసారిగా ఉద్యోగ విరమణ పొందిన వ్యక్తిని తిరిగి అదే స్థానంలో కొనసాగేలా ఉత్తర్వులు జారీ అయ్యాయి.


