● రమణీయం.. రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

● రమణీయం.. రథోత్సవం

Feb 3 2026 7:31 AM | Updated on Feb 3 2026 7:31 AM

● రమణ

● రమణీయం.. రథోత్సవం

ఉరవకొండ రూరల్‌: మండల పరిధిలోని వెలిగొండ గ్రామంలో వెలసిన భగళాముఖీ అమ్మవారి రథోత్సవం సోమవారం రమణీయంగా సాగింది. ఉదయం అమ్మవారికి అభిషేకం, మహామంగళ హారతి, కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీగురు సిద్ధేశ్వర స్వామి మఠం నుంచి గురు మహలింగప్పస్వామి గ్రామస్తులు, భక్తులతో కలిసి భగళాముఖీ అమ్మవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం విశేష పుష్పాలతో అలంకరించిన అమ్మవారి రథోత్సవాన్ని భక్తులు ముందుకు లాగారు. రథోత్సవంలో ఎంపీపీ నరసింహులు, సర్పంచ్‌ వీరాంజినేయులు, నాగప్ప, శివ తదితరులు పాల్గొన్నారు.

● ఉత్సవాల్లో భాగంగా మంగళవారం గురుసిద్దావధూతల రథోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా గురుమహలింగస్వామి ఆధ్వర్యంలో భవిష్యవాణి వినిపించనున్నారు.

● రమణీయం.. రథోత్సవం1
1/1

● రమణీయం.. రథోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement