కార్యకర్తలకు అండగా ఉంటాం
శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు అండగా ఉంటాం. కష్టపడి పనిచేసిన వారందరికీ ప్రాధాన్యత ఇస్తాం. అన్ని గ్రామాల్లో కమిటీల ఏర్పాటు ద్వారా జగనన్న సైనికులను తయారు చేసుకుంటాం. నియోజకవర్గంలో 12 వేల మందితోనే కాకుండా మరింత ఎక్కువ మందిని కమిటీల్లో చేర్చే విధంగా కృషి చేస్తాం. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ భయపడవద్దు. అధికారం ఉంది కదా అని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బందులు పెట్టాలని చూస్తే టీడీపీ నాయకులకు తాట తీస్తాం.
– డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల సమన్వయకర్త


