వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పేరం స్వర్ణ
అనంతపురం/తాడిపత్రి టౌన్: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర నూతన సంయుక్త కార్యదర్శిగా తాడిపత్రికి చెందిన పేరం స్వర్ణలత నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆర్ట్స్ కళాశాలలో పీజీ
కోర్సులకు స్పాట్ అడ్మిషన్లు
అనంతపురం సిటీ: జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాలలో పీజీ కోర్సుల్లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మశ్రీ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీజీసెట్ రాయని వారితో పాటు ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 9, 10 తేదీల్లో జరిగే స్పాట్ అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి. ఎంఏ ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, ఎంకామ్, ఎమ్మెస్సీ బొటనీ, జువాలజీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, జియాలజీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమ్యాటిక్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్ కోర్సుల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. అడ్మిషన్ పొందిన వారు అదే రోజు కోర్సు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ప్రణాళిక రూపొందించండి
అనంతపురం అర్బన్: ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) అమలుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆనంద్ అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌హాల్‌లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎండీడీకేవై అమలుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లాస్థాయితో పాటు మండలస్థాయిలోనూ ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ, ఉద్యాన శాఖ డీడీ ఉమాదేవి, డీసీఓ అరుణకుమారి, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, పశుసంవర్ధక శాఖ జేడీ ప్రేమ్‌చంద్, కేవీకే శాస్త్రవేత్త మల్లేశ్వరి, డ్వామా పీడీ సలీమ్‌బాషా, ఎల్‌డీఎం నరేష్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, పరిశ్రమల శాఖ ఏడీ రాజశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


