బొలెరో వాహనానికి నిప్పు
యల్లనూరు: మండలంలోని వెన్నపూసపల్లిలో గట్టు విజయ్‌కుమార్‌కు చెందిన బొలెరో (ఏపీ 27 టీడబ్ల్యూ 0227) వాహనానికి మంగళవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం రాత్రి విజయ్‌కుమార్ తన బొలెరో వాహనాన్ని నివాసం సమీపంలో పెట్టి ఇంట్లోకి వెళ్లి నిద్రించాడు. బుధవారం వేకువజామున నిద్రలేచి చూసే సరికి వాహనం పూర్తిగా కాలిపోయి కనిపించింది. సమాచారం అందుకున్న పుట్లూరు సీఐ సత్యబాబు.. సిబ్బందితో కలసి అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ రామాంజనేయరెడ్డి తెలిపారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుడిగా ఉన్నందుకే ఈ పని చేశారా? లేదా ఎవరైనా కక్షతో నిప్పు పెట్టారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.


