డైవర్షన్ పాలిటిక్స్ మానుకోండి
గుంతకల్లు టౌన్: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటకు కారణమైన కూటమి ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మరల్చడం, మొంథా తుపాన్ కారణంగా కుదేలైన రైతుల గోడును పక్కదారి పట్టించేందుకే డైవర్షన్ పాలిటిక్స్‌కు సీఎం చంద్రబాబు తెరలేపారని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ఇందులో భాగంగానే బీసీనేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసిందన్నారు. మంగళవారం గుంతకల్లులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ మద్యం తయారీ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయిన కూటమి నేతలను తప్పించడానికే జోగి రమేష్‌ను దుర్మార్గంగా అరెస్ట్ చేశారన్నారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తిరుమల, సింహాచలం, కాశీబుగ్గ ఆలయాల్లో తొక్కిసలాటలు చోటు చేసుకుని అమాయకులైన భక్తులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రజల ప్రాణాలంటే కూటమి ప్రభుత్వానికి లెక్కలేదన్నారు. అవినీతి, అక్రమాల్లో పీకల్లోతు కూరుకుపోయిన కూటమి ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచక పాలనసాగిస్తోందని ధ్వజమెత్తారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేయడం మానుకుని తుపాన్ బాధిత రైతులను, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జింకల రామాంజనేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, కార్యదర్శి తిమ్మప్ప, కౌన్సిలర్ లింగన్న, కో–ఆప్షన్ సభ్యుడు ఫ్లయింగ్ మాబు, మాజీ కౌన్సిలర్ పాండు, ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌రెడ్డి, అనుబంధ విభాగాల నియోజకవర్గ అధ్యక్షులు అబ్దుల్‌బాసిద్, మౌలా, పవన్, షాబుద్దీన్, సీనియర్ నాయకులు నూర్‌నిజామి, బావన్న, కాకర్ల నాగేశ్వరరావు, రమేష్, మార్కెట్ వెంకటేష్, గోవిందునాయక్, ఆనంద్, రాము, ఆర్‌డీజీ.బాషా, శివ, రాము, వలి, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే కాశీబుగ్గలో తొక్కిసలాట
జోగి రమేష్ అరెస్ట్ దుర్మార్గం
సర్కారుపై గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి మండిపాటు


