
జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
తేనెటీగల దాడిలో రెవెన్యూ ఉద్యోగులకు గాయాలు
వజ్రకరూరు: రాగులపాడు సమీపంలోని హంద్రీ–నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం (లిఫ్ట్) వద్ద శనివారం సాయంత్రం రెవెన్యూ ఉద్యోగులపై తేనెటీగలు దాడి చేశాయి. పలువురు ఉద్యోగులు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని కొనకొండ్ల గ్రామానికి చెందిన ఎం.రామాంజినేయులు అనే వ్యవసాయ కూలీ నాలుగు రోజుల క్రితం ఛాయాపురం వద్ద ఉన్న హంద్రీ–నీవా ప్రధాన కాలువలో గల్లంతయ్యాడు. ఇప్పటికీ అతని ఆచూకీ లభించలేదు. దీంతో రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది, వజ్రకరూరు పోలీసులు గాలింపు చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం సాయంత్రం వజ్రకరూరు తహసీల్దార్ నరేష్‌కుమార్ నేతృత్వంలో ఆర్‌ఐ సతీష్‌కుమార్, వీఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్‌ఏలు విజయ్, పెన్నయ్య, సుంకన్నతో పాటు మరికొందరు రెవెన్యూ ఉద్యోగులు ఛాయాపురం నుంచి రాగులపాడు లిఫ్ట్ వరకు కాలువ వెంట గాలించారు. రాగులపాడు లిఫ్ట్ వద్ద అకస్మాత్తుగా తేనెటీగలు దాడిచేశాయి. వీఆర్వోలు ఛత్రేనాయక్, రంగస్వామి, వీఆర్‌ఏలు విజయ్, పెన్నయ్య, సుంకన్న తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే వజ్రకరూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.

జిల్లా అంతటా శనివారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ