
‘ఈ–క్రాప్’ నమోదు చేయాలంటూ వినూత్న నిరసన
విడపనకల్లు: తాము సాగు చేసిన పంటలకు ఈ క్రాప్ నమోదు చేయాలంటూ విడపనకల్లు మండలం హవళిగి గ్రామ సచివాలయం ఎదుట జాతీయ పతాకంతో రైతులు నిరసన తెలిపారు. పంటల నమోదు చేయాలంటూ పలుమార్లు వ్యవసాయాధికారి పెన్నయ్యను కోరినా ఆయన స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంట నమోదు ప్రక్రియ మంగళవారంతో ముగియనుందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల నమోదు చేయాలంటూ అర్జీ ఇచ్చేందుకు వస్తే ‘ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుంది.. ఈ ప్రభుత్వం మరికొన్ని రోజులు గడువు పెంచుతుందిలే’ అంటూ వ్యవసాయాధికారి విడ్డూరంగా మాట్లాడుతున్నారని వాపోయారు. అనంతరం సమస్యకు పరిష్కారం కోరుతూ పంచాయతీ కార్యదర్శి రామకృష్ణకు అర్జీ అందజేశారు.
రోజుల తరబడి అభ్యర్థించినా మండల వ్యవసాయాధికారి
స్పందించ లేదంటూ ఆవేదన
ఈ–క్రాప్ చేయకపోతే ఏమవుతుందంటూ ఏఓ విడ్డూరపు వ్యాఖ్యలు