
కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం
● సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
నరసింగరావు
అనంతపురం అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు అన్నారు. సీఐటీయూ మహాసభల వేదిక వద్ద జిల్లా ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌తో కలిసి ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. విద్యుత్ ప్రైవేటీకరణ విధానాలను వీడాలన్నారు. జిల్లాలో పేదలపాలిట కల్పతరువుగా ఉన్న ఆర్‌డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్‌కు కార్మికులు పోరాటం సాగించాలన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్, అంగన్‌వాడీ, ఆశ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులపై రాజకీయ వేధింపులు ఆపకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, తొలగించిన కార్మికులను విధుల్లో తీసుకోవాలన్నారు.
ముగిసిన మహాసభలు: సీఐటీయూ జిల్లా మహాసభలు ముగిశాయి. 59 మందితో సీఐటీయూ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగేంద్రకుమార్ మరోసారి ఎన్నికయ్యారు.