గుత్తి: స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో జిలాన్ గ్యాస్ ఫిల్లింగ్ దుకాణంలో గురువారం విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టి అక్రమంగా నిల్వ చేసిన 21 గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి, రెవెన్యూ అధికారులకు అప్పగించారు. ఘటనపై కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో విజిలెన్స్ ఎస్‌ఐ నరేంద్ర భూపతి, సీఎస్‌డీటీ జీవీ ప్రవీణ్, సిబ్బంది పాల్గొన్నారు.
వ్యక్తి దుర్మరణం
రాప్తాడు: గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం పాతూరులోని భవానీ నగర్‌లో నివాసముంటున్న కురుబ మల్లేశప్ప (53), రమాదేవి దంపతులు తోపుడు బండిపై అరటి కాయల వ్యాపారంతో జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో గురువారం ఉదయం మల్లేశప్ప రాప్తాడు మండలం గొల్లపల్లి సమీపంలో అరటి తోటలు చూసుకుని 44వ జాతీయ రహదారి దాటుతుండగా బెంగళూరు వైపు నుంచి శరవేగంగా దూసుకొచ్చిన వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. రాత్రి 7 గంటలకు మృతుడిని మల్లేశప్పగా కుటుంబసభ్యులు నిర్ధారించారు. ఘటనపై సీఐ టి.వి.శ్రీహర్ష కేసు నమోదు చేశారు.