
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే బలవన్మరణాలకు కారణంగా తెలుస్తోంది.
కళ్యాణదుర్గం రూరల్: స్థానిక రాచప్పబావి కాలనీకి చెందిన తిప్పేస్వామి (34) ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రహ్మసముద్రం మండలం ముప్పులకుంట గ్రామానికి చెందిన తిప్పేస్వామి జేసీబీ ఆపరేటర్గా పనిచేస్తూ రెండు నెలల క్రితం రాచప్ప బావి కాలనీలోని అద్దె ఇంటికి మకాం మార్చాడు. భార్య గీతాంజలి, నాలుగేళ్ల వయసున్న కుమార్తె ఉన్నారు. తీవ్ర అర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ మనోవేదనకు లోనైన ఆయన గురవారం తెల్లవారుజామున ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం సిటీ: అనంతపురం–తాటిచెర్ల మార్గంలోని డౌన్ లైన్ మధ్యలో రైలు కింద పడి గుర్తు తెలియని ఓ యువకుడు(35) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తల నుజ్జునుజ్జు కావడంతో మృతుడిని గుర్తించడం కష్టమైంది. సమాచారం అందుకున్న రైల్వే హెడ్‌కానిస్టేబుల్ దామోదర్ అక్కడకు చేరుకుని పరిశీలించి, కేసు నమోదు చేశారు.