
‘ఎస్‌ఆర్‌ఐటీ’కి జాతీయ గుర్తింపు
బుక్కరాయసముద్రం: మండలంలోని రోటరీపురం వద్ద ఉన్న ఎస్‌ఆర్‌ఐటీ ఇంజినీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బాలకృష్ణ గురువారం వెల్లడించారు. ఇటీవల భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, యూజీసీ మద్దతుతో నిర్వహించిన జాతీయ స్థాయి పర్యావరణ సంరక్షణ్ పోటీల్లో ఎస్‌ఆర్‌ఐటీకి చెందిన 23 మంది విద్యార్థులు ప్రతిభ చాటారు. దేశంలోనే అత్యున్నత స్థాయిలో ఉన్న వంద విద్యాసంస్థలు పోటీకి హాజరు కాగా, ఎస్‌ఆర్‌ఐటీకి 85వ స్థానం దక్కింది. ఏపీ నుంచి ప్రాతినిథ్యం వహించిన మొట్టమొదటి విద్యాసంస్థగా ఎస్‌ఆర్‌ఐటీకి ఖ్యాతి దక్కింది. ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం కళాశాలలో అధ్యాపకులు అభినందించారు.