
●ప్రయాణం.. ప్రహసనం
దసరా పండుగ నేపథ్యంలో కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో జిల్లా కేంద్రంలోని వివిధ ప్రైవేట్, కార్పొరేట్, ప్రభుత్వ విద్యాసంస్థల వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో పిల్లలను పిలుచుకెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణం కావడంతో గతంలో కంటే భిన్నంగా ఈ సారి తల్లులే అత్యధికంగా వచ్చారు. బస్సుల సంఖ్య పెంచక పోవడంతో ఉన్న బస్సులన్నీ కిక్కిరిశాయి. బస్టాండ్ పాయింట్‌లో బస్సు ఆగగానే ఎక్కేందుకు మహిళలు పోటీ పడ్డారు. తోపులాట చోటు చేసుకుంది. ఇక పురుషులు బస్సు కిటికీల నుంచి లోపలకు ప్రవేశించాల్సి వచ్చింది. – అనంతపురం క్రైం/సాక్షి ఫొటోగ్రాఫర్:
● ఆదాయం రాకపోగా రైతన్నకు చేతి నుంచి రూ.600 ఖర్చు
జిల్లాకు చేరిన 756 మెట్రిక్ టన్నుల యూరియా
అనంతపురం అగ్రికల్చర్: స్పిక్ కంపెనీకి చెందిన 756.315 మెట్రిక్ టన్నుల యూరియా, 586 మెట్రిక్ టన్నుల 20–20–0–13, 113.6 మెట్రిక్ టన్నులు 10–26–26 రకం కాంప్లెక్స్ ఎరువులు జిల్లాకు చేరినట్లు రేక్ ఆఫీసర్, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ తెలిపారు. స్థానిక ప్రసన్నాయపల్లి రైల్వేస్టేషన్ రేక్‌పాయింట్‌కు వ్యాగన్ల ద్వారా గురువారం చేరిన యూరియాను ఆయన పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు 450 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్‌ఫెడ్‌కు, మిగతా 306.315 మెట్రిక్ టన్నులను ప్రైవేట్ డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు.
దళారుల రాజ్యం.. రైతు నిలువు దోపిడీ
‘గురుకుల’ సిబ్బంది నిర్లక్ష్యానికి
చిన్నారి మృతి
బుక్కరాయసముద్రం: మండలంలోని కొర్రపాడు వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ చిన్నారి బలైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సేవా సుప్రీం ఏజెన్సీ కింద పాఠశాలలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న కృష్ణవేణి కుమార్తె, 17 నెలల వయసున్న చిన్నారి 3 రోజుల క్రితం గురుకుల పాఠశాల సిబ్బంది కాచి పక్కన ఉంచిన పాలలో పడి తీవ్రంగా గాయపడింది. దీంతో గుట్టుచప్పుడు కాకుండా చిన్నారిని కర్నూలులోని ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చిన్నారి మృతి చెందింది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి మృతి చెందిందని దళిత సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
పెద్దపప్పూరు: దళారులు ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తుండడంతో టమాట రైతు నిలువు దోపిడీకి గురయ్యాడు. పంటను మార్కెట్‌కు తరలిస్తే లాభం మాట దేవుడెరుగు... రైతు చేతి నుంచే రూ. వందలు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. వివరాలు... పెద్దపప్పూరుకు చెందిన టమాట రైతు షేక్ రఫీ గురువారం 25 కిలోల చొప్పున 31 బాక్సుల టమాటను బొలెరో వాహనంలో నంద్యాల జిల్లా ప్యాపిలిలోని మార్కెట్‌లో విక్రయానికి తీసుకెళ్లాడు. ఇందుకు గాను వాహనానికి రూ.1,500 అద్దె చెల్లించాడు. అక్కడి దళారులు గ్రేడింగ్ చేసి 31 బాక్సులను కాస్త 23 బాక్సులకు కుదించారు. బాక్స్‌కు రూ.70 చొప్పున వేలం పాడడంతో రూ.1,610 వచ్చింది. దళారుల కమీషన్ రూ.160 పోను రూ.1,450 చేతికి అందింది. పంట కోసిన కూలీలకు రూ. 600 రైతు చేతి నుంచి ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చింది. ఒక్క రూపాయి ఆదాయం రాకపోగా చేతి నుంచి మరింత ఖర్చు పెట్టాల్సి రావడంతో రైతు ఆవేదనకు అంతులేకుండా పోయింది.

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం

●ప్రయాణం.. ప్రహసనం