గుంతకల్లు: బెంగళూరు నుంచి కలబురిగి వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు అంతరాయం ఏర్పడింది. గుంతకల్లులోని ధర్మవరం ఎల్‌సీ గేట్ వద్ద మంగళవారం సాయంత్రం వివిధ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, గూడ్స్ రైలు రాకపోకలు సాగించాయి. ఈ నేపథ్యంలో గేట్ తరుచూ వేయడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాదారులు విసుగెత్తిపోయారు. అదే సమయంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ వస్తుండగా మరోసారి గేట్ వేయడానికి ప్రయత్నిస్తుండగా ట్రాఫిక్ జామ్ అయి గేట్ వేయడానికి సాధ్యపడలేదు. దీంతో ధర్మవరం గేట్ సమీపంలో దాదాపు 15 నిమిషాల సేపు వందేభారత్‌ను నిలబెట్టేశారు. అనంతరం వాహనాదారులను బతిమలాడుకుని గేట్ వేయడంతో రైలు ముందుకు కదిలింది.
నాయీబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
అనంతపురం టవర్‌క్లాక్: గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్‌లో ప్రతిభ చూపిన నాయీబ్రాహ్మణ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రాష్ట్ర నాయీబ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 30 తేదీలోపు దరఖాస్తులను ఎం.శ్రీనివాసులు, డోర్ నంబర్ 18/1/406, వేణుగోపాల నగర్, అనంతపురం – 515005కు పంపాలి. పూర్తి వివరాలకు 94412 22874లో సంప్రదించవచ్చు.
సొసైటీ కార్యాలయంపై వైఎస్సార్ పేరు తొలగింపు
బుక్కరాయసముద్రం: మండల కేంద్రంలోని సహకార సొసైటీ కార్యాలయంపై ఉన్న మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పేరును తొలగిస్తూ రంగులు వేశారు. రైతాంగానికి డాక్టర్ వైఎస్సార్ చేసిన సేవలకు గుర్తుగా బీకేఎస్‌లోని సహకార సొసైటీ కార్యాలయానికి 2009లో బోర్డు డైరెక్టర్లు రైతుల ఆమోదంతో డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి సహకార సంఘం కార్యాలయంగా పేరు పెట్టారు. ఇది జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు మంగళవారం వైఎస్సార్ పేరును తొలగిస్తూ రంగులు వేయడాన్ని గమనించిన పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
‘వందేభారత్’కు అంతరాయం