
రెడ్లపై వివక్ష వీడాలి
● రెడ్డి సంఘం నాయకుల వినతి
అనంతపురం అర్బన్: రెడ్ల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఏపీ రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగులకుంట నరేష్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు పాటిల్ రామకృష్ణారెడ్డి విమర్శించారు. తక్షణం రెడ్డి కార్పొరేషన్‌కు పాలమండలి ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో డీఆరోఓ ఎ.మలోలను నాయకులు కలసి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఓసీల్లో అన్ని కులాల కార్పొరేషన్లకు పాలకమండళ్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. అయితే రెడ్డి కార్పొరేషన్‌కు మాత్రం పాలకమండలి ఏర్పాటు చేయకపోవడం చూస్తుంటే కూటమి ప్రభుత్వానికి రెడ్లపై ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోందన్నారు. రాష్ట్రంలో 60 లక్షలకుపైగా రెడ్లు ఉన్నారన్నారు. రాజకీయంగా, వ్యాపారంపరంగా రెడ్లను బలహీనపర్చాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవన్నారు. కాబట్టి రెడ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉండాలన్నారు. రెడ్లను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు కృష్ణారెడ్డి, సోమిరెడ్డి, చవ్వా హనుమంతరెడ్డి, అరవిందరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, హనుమంతరెడ్డి, అనిల్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, పరంధామరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.