
మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత
శింగనమల: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతో ఇబ్బంది పడుతున్నా ఈ నెల 9న అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద నిర్వహించిన ‘అన్నదాత పోరు’లో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌లోని సొంతింటికి వెళ్లారు. ఉన్నట్టుండి శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను ఆపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. శైలజానాథ్ త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు కోరుకుంటున్నారు.
నేలకూలిన భారీ వృక్షం
గుత్తి: పట్టణంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ ఆవరణలోని భారీ వేప వృక్షం మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఈదురు గాలులకు శనివారం నేలకూలింది. ఆ సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. చెట్టు కూలిన విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ సిబ్బంది ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్టు అధికారులు కూలిన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత