
ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?
ప్రజాస్వామ్య దేశంలో పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పాత్రికేయులపై కేసులు నమోదు చేయడం దారుణం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు. నిజాలను వెలికితీస్తున్న ‘సాక్షి’పై కూటమి సర్కార్ అక్కసు వెళ్లగక్కుతోంది. పోలీసు వ్యవస్థలో లోటుపాట్ల గురించి రాస్తే పత్రికా యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ పేరుతో వేధిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ‘సాక్షి’పై కేసు నమోదును తీవ్రంగా ఖండిస్తున్నాం. వాక్ స్వాతంత్య్రాన్ని హరించే హక్కు ఎవరికీ లేదు.
–వై.విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ

ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే కేసులా?