
జాతీయ స్థాయి వర్సిటీ పోటీల్లో సత్తా చాటాలి
● స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశంలో జేఎన్‌టీయూ వీసీ సుదర్శనరావు
అనంతపురం: దక్షిణ భారతదేశ అంతర వర్సిటీ, జాతీయ స్థాయి పోటీల్లో జేఎన్‌టీయూ(ఏ) విద్యార్థులు సత్తా చాటాలని ఆ వర్సిటీ వీసీ హెచ్.సుదర్శనరావు పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ (ఏ)లో గురువారం నిర్వహించిన 16వ స్పోర్ట్స్ కౌన్సిల్ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి, మాట్లాడారు. 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ క్రీడలను నిర్వహించే కాలేజీలను ,క్రీడాభివృద్ధికి సంబంధించిన అంశాలను స్పోర్ట్స్ కౌన్సిల్‌కు వివరించారు. జాతీయ, దక్షిణ భారత అంతర వర్సిటీ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు వర్సిటీ తరపున తగిన ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. కార్యక్రమంలో రిజిస్టార్ ఎస్.కృష్ణయ్య, డీఏపీ ఎస్వీ సత్యనారాయణ, డీఈ వి.నాగప్రసాదనాయుడు, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్ సుబ్బారెడ్డి, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ పి.చెన్నారెడ్డి, పులివెందుల కళాశాల ప్రిన్సిపాల్ డి. విష్ణువర్ధన్, ఫిజికల్ డైరెక్టర్ బి.జోజిరెడ్డి, జేఎన్‌టీయూ స్పోర్ట్స్ సెక్రెటరీ డాక్టర్ టి.నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.