రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు
రాప్తాడు: బత్తాయి, అరటి పంటలకు సరైన మార్కెటింగ్ వసతి, మెరుగైన ధర కల్పించి రైతులను ఆదుకుంటామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు అన్నారు. రాప్తాడు మండలం మరూరులో గురువారం ఆయన పర్యటించి బత్తాయి, అరటి పంటలను పరిశీలించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు. బత్తాయి, అరటి పంటల సాగుకు రూ.లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తోందని, ఈ క్రమంలో పంట ఉత్పత్తులకు మార్కెట్‌లో గిట్టుబాటు ధర లేక నష్టపోవాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
గిట్టుబాటు ధర లేకపోవడంతో పొలాల్లోనే పంటను వదిలేయాల్సి వస్తోందన్నారు. బత్తాయి, అరటి రైతులకు మార్కెటింగ్ వసతితో పాటు మెరుగైన ధర కల్పిస్తామంటూ శ్రీనివాసులు భరోసానిచ్చారు. వివిధ ఉద్యాన పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన అధికారులు ఉమాదేవి, చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ రఘునాథరెడ్డి, ఏపీడీ ధనుంజయ, ఏడీ దేవానంద్, పాల్గొన్నారు.
చాబాలలో క్షుద్రపూజల కలకలం
వజ్రకరూరు: మండలంలోని చాబాలలో గురువారం క్షుద్రపూజల కలకలం రేగింది. గాలిమరలకు వెళ్లేదారి పక్కన గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు కనిపించాయి. మధ్యాహ్నం అటుగా వెళ్తున్న గొర్రెల కాపరులు చూసి గ్రామస్తులకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

రైతులకు మార్కెటింగ్ వసతి కల్పిస్తాం