
జక్కల ఆదిశేషుకు కన్నీటి వీడ్కోలు
తనకల్లు: వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, నల్లమాడ మాజీ జెడ్పీటీసీ సభ్యుడు జక్కల ఆదిశేషు అంత్యక్రియలు గురువారం ఆయన స్వగ్రామం బొంతలపల్లిలో అశ్రునయనాల మధ్య జరిగాయి. కాగా, బొంతలపల్లికి గురువారం కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ అహమ్మద్ చేరుకుని జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జక్కల ఆదిశేషు భార్య జెడ్పీటీసీ సభ్యురాలు జక్కల జ్యోతి, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యేలు దేశాయి తిప్పారెడ్డి, డాక్టర్ సిద్దారెడ్డి, మండల వైఎస్సార్‌సీపీ కన్వీనర్ అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ముస్తఫా, పలువురు జిల్లా నాయకులు, మండల కమిటీ సభ్యులు తదితరులు జక్కల ఆదిశేషు మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
‘అనంత’ నేతల నివాళి
జక్కల ఆదిశేషు మృతదేహాన్ని గురువారం వైఎస్సార్‌సీపీ రాస్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్, పార్టీ అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, అనంతపురం జిల్లా బూత్ కమిటీ అధ్యక్షులు అమరనాతరెడ్డి, గౌడ్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కల లక్ష్మీనరసింహగౌడ్, బీసీ సంఘం ప్రచార కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సంపంగి గోవర్ధన్, కదిరి సాయి, జై గౌడ రాష్ట్ర నాయకులు రాజ్‌కుమార్, వాల్మీకి అంజి, పవన్, బెస్త వెంకటేష్ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.