
ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం సిటీ: ఉద్యోగుల హక్కుల పరిరక్షణతో పాటు వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేస్తున్నామని జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. జెడ్పీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి సెప్టెంబర్‌లోనే ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ప్యానల్ రూపొందించిన నేపథ్యంలో గిరిజమ్మతో పాటు సీఈఓ శివశంకర్, డిప్యూటీ సీఈఓ సుబ్బయ్యను జెడ్పీ ఉద్యోగులు గురువారం ఘనంగా సన్మానించారు. ఏఓలు విజయభాస్కర్‌రెడ్డి, రత్నాబాయి, శ్రీవాణి, షబ్బీర్ నియాజ్, మహబూబ్ వలి, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
గిరిజమ్మను కలిసిన పీఆర్ ఎస్‌ఈ
జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మను పంచాయతీరాజ్ రాయలసీమ సర్కిల్ కార్యాలయ సూపరింటెండెంట్(ఎస్‌ఈ) వై.చిన్నసుబ్బరాయుడు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. పల్నాడులో పని చేస్తూ పదోన్నతిపై అనంతపురం ఎస్‌ఈగా వచ్చిన ఆయన.. జిల్లా పరిషత్ కార్యాలయంలోని చాంబర్‌లో చైర్‌పర్సన్ కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఆయనకు గిరిజమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనంతపురం సబ్ డివిజన్–1, 2 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ, కృష్ణజ్యోతి పాల్గొన్నారు.