
కర్షక లోకం కన్నెర్ర
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కళాశాల నుంచి క్లాక్‌టవర్ మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీలు మంగమ్మ, వై.శివరామిరెడ్డి, మాజీ మంత్రి, పార్టీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త పెద్దారెడ్డి పాల్గొని ఆర్‌డీఓ కార్యాలయంలో ఆర్‌డీఓ కేశవనాయుడుకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్ రెడ్డి, పార్టీ అనంతపురం పార్లమెంటు పరిశీలకులు నరేష్ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డి, డిప్యూటీ మేయర్లు కోగటం విజయభాస్కర్ రెడ్డి, వాసంతి సాహిత్య, పీఏసీ సభ్యులు మహాలక్ష్మి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు రమేష్‌రెడ్డి, రమేష్ గౌడ్, ఉమ్మడి మదన్‌మోహన్ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వర్థ్ నాయక్, మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాగజ్ ఘర్ రిజ్వాన్ పాల్గొన్నారు.
● కళ్యాణదుర్గంలో వాల్మీకి సర్కిల్ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీ కళ్యాణదుర్గం, రాయదుర్గం సమన్వయకర్తలు తలారి రంగయ్య, మెట్టు గోవిందరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు తిప్పేస్వామి, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయ ఏఓ చంద్రశేఖర్‌కు వినతి పత్రం అందించారు.
● గుంతకల్లులో నిర్వహించిన ర్యాలీలో పార్టీ శ్రేణులు, రైతులు కదం తొక్కారు. ఉరవకొండ, గుంతకల్లు నియోజకవర్గాల నుంచి రైతులు తరలివచ్చారు. పార్టీ గుంతకల్లు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌డీఓ కార్యాలయ ఏఓ నాగభూషణంకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ భవాని, పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వర బాబు, జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న పాల్గొన్నారు.
రైతుల్ని బాధపెడితే ప్రభుత్వాలే కూలుతాయి
అన్నం పెట్టే రైతన్నను బాధపెడితే ప్రభుత్వాలు కూలిపోతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏనాడూ రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించలేదు. కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే యూరియా బ్లాక్‌మార్కెట్‌కు తరలిపోయింది. వ్యవసాయానికి చంద్రబాబు అనే తెగులు, చీడ పట్టుకుంది. ఓ వైపు తుంగభద్ర, శ్రీశైలం నుంచి నీరు సముద్రం పాలవుతుంటే.. మరోవైపు జిల్లాలో సౌత్, నార్త్ కెనాల్‌కు నీరు ఇవ్వలేని దుస్థితి నెలకొంది. జిల్లా ప్రజలను పస్తులు పెట్టి కుప్పానికి నీరు తరలించడం సరికాదు. హంద్రీ–నీవా వెడల్పుతో పాటు హెచ్‌ఎల్‌సీ ద్వారా ప్రజలకు నీరందించాలి.
– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
బూటకపు సర్కారుపై
భగ్గుమన్న అన్నదాతలు
వైఎస్సార్ సీపీ తోడుగా
కదం తొక్కిన రైతన్నలు
సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు
ఎరువుల బ్లాక్‌మార్కెటింగ్, యూరియా కొరతపై మండిపాటు
వైఎస్సార్ సీపీ ‘అన్నదాత పోరు’ విజయవంతం
వ్యవసాయానికి చంద్రబాబు పీడ: పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత ధ్వజం

కర్షక లోకం కన్నెర్ర

కర్షక లోకం కన్నెర్ర