
కేసులు నమోదు చేస్తామనడమేంది బాబూ
యూరియా అందక రైతులు సోషల్ మీడియా వేదికగా మాట్లాడితే వారిపై కేసులు నమోదు చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పడమేంటి? అధికారులతో గణాంకాలు తెప్పించుకోవడమే కాదు, క్షేత్రస్థాయిలో రైతులకు యూరియా అందిందో లేదో చంద్రబాబు తెలుసుకోవాలి. యూరియాను పక్కదారి పట్టించిన వారిపై కేసులు నమోదు చేయాలి.
– నరేష్‌కుమార్ రెడ్డి, పార్టీ పార్లమెంట్ పరిశీలకులు
అవహేళన చేస్తారా?
రైతులు రోడ్డెక్కి ఇబ్బందులు పడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అవహేళనతో మాట్లాడడం సరికాదు. గతంలో రైతులకు మేలు చేసేందుకు ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్, జలయజ్ఞం తదితర వాటిని అవహేళన చేసిన చరిత్ర చంద్రబాబుది.
– రమేష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి
మోసానికి బ్రాండ్ అంబాసిడర్
మోసానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్. అధికారం కోసం ప్రజలకు అలవిగాని హామీలు ఇచ్చి మోసం చేశారు. సూపర్ సిక్స్ హామీల్లో రెండు పథకాలను అసలు అమలే చేయలేదు. మిగిలిన వాటిని కూడా అరకొరగా అమలు చేసి చేతులు దులుపుకున్నారు. అయినా నేడు ఏం ముఖం పెట్టుకుని జిల్లాకు వస్తున్నారో అర్థం కావడం లేదు.
– గోరంట్ల మాధవ్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి
●

కేసులు నమోదు చేస్తామనడమేంది బాబూ

కేసులు నమోదు చేస్తామనడమేంది బాబూ