
డీసీసీబీలో ‘క్యూఆర్ కోడ్’ సేవలు
బొమ్మనహాళ్: మండలంలో కల్లుదేవనహాళ్లి వద్ద హగరి నది పరివాహక ప్రాంతంలో ఉన్న చేతిపంపు భద్రతకు అధికారులు రింగులను ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమ తవ్వకాలతో దాదాపు 8 అడుగుల మేర అందనంత ఎత్తునకు చేతి పంపు చేరుకుంది. ఈ నేపథ్యంలో చేతి పంపు విరిగి పోకుండా గ్రామస్తులు ఒడ్డున ఉన్న చెట్టు కొమ్మకు కట్టి అతి కష్టంపై తాగునీటి సేకరించుకోసాగారు. ఈ అంశాన్ని ‘ఇసుకాసురల పాపం.. ఇదే సాక్ష్యం’ శీర్షికన ఈ నెల 8న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంపీడీఓ దాస్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనానాయక్ వెంటనే చర్యలకు ఉపక్రమించారు. చేతి పంపు విరిగిపోకుండా చుట్టూ రింగు ఏర్పాటు చేసి మంగళవారం ఉదయం సిమెంట్ కాంక్రీట్ వేశారు. అలాగే గ్రామస్తులు తాగునీటి పట్టుకునేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

డీసీసీబీలో ‘క్యూఆర్ కోడ్’ సేవలు