
రూ.12.80 లక్షల విలువైన వాహనాల స్వాధీనం
అనంతపురం: నగరంలో ద్విచక్ర వాహనాలు, ఆటోలను అపహరిస్తున్న పాతూరులోని పెద్దమ్మగుడి ప్రాంతంలో నివాసముంటున్న ఖాదర్ బాషా కుమారుడు షేక్ ఖాజాపీర్‌ను అరెస్ట్ చేసినట్లు అనంతపురం రెండో పట్టణ పీఎస్ ఎస్‌ఐ రుష్యేంద్రబాబు తెలిపారు. ప్రసన్నాయపల్లి రైల్వే గేట్ సమీపంలో అగ్గిపెట్టెల ఫ్యాక్టరీ వద్ద సోమవారం అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఖాజాపీర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో విషయం వెలుగు చూసిందన్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రూ.12.80 లక్షల విలువ చేసే మూడు ఆటోలు, ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. కాగా, ఇదివరకే ద్విచక్ర వాహనాల అపహరణ కేసులో ఖాజాపీర్ పాత నేరస్తుడని, రిమాండ్‌కు వెళ్లి విడుదలైన అనంతరం తన పంథాను కొనసాగిస్తూ వస్తున్నాడని తెలిపారు.