
యూరియా ఇవ్వకుండా సభలంట
ఐదు ఎకరాల్లో మొక్కజొన్న పంట సాగు చేశా. ఇప్పుడు పంటకు యూరియా చాలా అవసరం. పంట దిగుబడి రావాలంటే యూరియా వేయాలి. రెండు నెలలుగా రైతు సేవా కేంద్రం చుట్టూ తిరుగుతూ.. వ్యవసాయ అఽఽధికారులను అడిగినా యూరియా రాలేదని చెబుతున్నారు. మా లాంటి రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే అధికారులు, పాలకులేమో సూపర్ సిక్స్ పథకాలు హిట్ అయ్యాయని సభలు పెట్టుకోవడం సిగ్గుచేటు.
–గొల్ల శివన్న, రైతు, కదిరిదేవరపల్లి,
కంబదూరు మండలం