
బొప్పాయి రైతులకు తిప్పలు
● మార్కెట్‌లో ధరలేక నష్టాలు
● చెట్లపైనే వదిలేసిన కాయలు
గుమ్మఘట్ట: మార్కెట్‌లో ధరల్లేక బొప్పాయి సాగు చేసిన రైతులు నష్టపోతున్నారు. నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని ఉద్యాన పంటలపై దృష్టి సారించిన రైతులు జిల్లా వ్యాప్తంగా 630 ఎకరాల్లో బొప్పాయి సాగు చేపట్టారు. ఉద్యానవఅధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ అధిక దిగుబడులూ సాధించారు. అయితే పంట చేతికి వచ్చే సరికి మార్కెట్‌లో ధరలు పతనమయ్యాయి. కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రాకపోవడంతో తోటల్లో చెట్లపైనే కాయలను రైతులు వదిలేస్తున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకున్న దళారులు కిలో రూ.7 చొప్పున కొనుగోలు చేస్తామంటూ వేదనను మిగిలిస్తున్నారు. ఎకరా విస్తీర్ణంలో బొప్పాయి సాగుకు రూ. లక్ష వరకు ఖర్చు పెట్టినట్లు రైతులు తెలిపారు.