‘కూటమి’ మెడలు వంచైనా న్యాయం | - | Sakshi
Sakshi News home page

‘కూటమి’ మెడలు వంచైనా న్యాయం

Sep 7 2025 7:36 AM | Updated on Sep 7 2025 7:36 AM

‘కూటమి’ మెడలు వంచైనా న్యాయం

‘కూటమి’ మెడలు వంచైనా న్యాయం

అనంతపురం కార్పొరేషన్‌: కూటమి ప్రభుత్వ మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట రామిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబుకు కనువిప్పు కలిగించేందుకే ఈ నెల 9న ‘అన్నదాత పోరు’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శని వారం స్థానిక వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యాలయంలో ‘అన్నదాత పోరు’ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రైతులను ప్రకృతి కూడా కరుణించలేదన్నారు. చంద్రబాబు ప్రభుత్వ సహకారమూ కరువై రైతులు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అన్నదాతల సమస్యలపై ఇప్పటికే ప్రభుత్వానికి అనేకమార్లు విన్నవించినా ఎటువంటి మార్పులేదన్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు ‘అన్నదాత పోరు’ తలపెట్టినట్లు వెల్లడించారు. తన రెక్కల కష్టంతో సమాజానికి అన్నం పెట్టే రైతన్నలకు మద్దతుగా ప్రతి ఒక్కరూ కదిలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఈ నెల 9న ఉరవకొండ, కళ్యాణదుర్గం, అనంతపురం రెవెన్యూ డివిజన్లలో ర్యాలీలు నిర్వహించి ఆర్‌డీఓలకు వినతి పత్రం అందిస్తామన్నారు. అనంతపురంలో జెడ్పీ వద్ద ఉన్న వైఎస్సార్‌ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్‌ మీదుగా ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ జరుగుతుందన్నారు. రైతులు, రైతు సంఘాలు, వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో గత ఖరీఫ్‌, రబీలో వర్షాభావ పరిస్థితులతో పంటలన్నీ దెబ్బతిన్నాయన్నారు. పెట్టుబడి కూడా తిరిగి రాలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో విత్తనాల నుంచి ఎరువుల వరకూ ఏ ఒక్కటీ సరఫరా చేయలేని దుస్థితి నెలకొందన్నారు. బ్లాక్‌ మార్కెట్‌కు యూరియాను తరలించారన్నారు. రూ.260 అమ్మాల్సిన యూరియా బస్తాను రూ.350 నుంచి రూ.400కు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి విన్నవించినా ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. జిల్లాలో 8.50 లక్షల ఎకరాల సాగుభూమి ఉంటే 4.30 లక్షల్లోనే పంటలు సాగు చేశారన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఏమాత్రమూ పట్టించుకోలేదన్నారు. హెచ్‌ఎల్‌సీ ద్వారా సౌత్‌,నార్త్‌ కెనాల్‌కు నీరందించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, మేయర్‌ వసీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రమేష్‌గౌడ్‌, జిల్లా ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి ప్రకాష్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలమూరు శ్రీనివాస్‌రెడ్డి, అనుబంధ సంఘాల అధ్యక్షులు శ్రీదేవి, సైపుల్లాబేగ్‌, చంద్రశేఖర్‌ యాదవ్‌, ఓబిరెడ్డి, సాకే చంద్రశేఖర్‌, అమర్‌నాథ్‌ రెడ్డి, శ్రీనివాసులు నాయక్‌, పార్టీ నగరాధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్నోబులేసు, పార్టీ రాష్ట్ర నేతలు వెన్నంశివరామిరెడ్డి, చుక్కలూరు దిలీప్‌ రెడ్డి, మారుతీనాయుడు, జానీ, కృష్ణవేణి, కార్పొరేటర్లు కమల్‌భూషణ్‌, సంపంగి రామాంజినేయులు, నాయకులు రాధాయాదవ్‌, అనిల్‌కుమార్‌ గౌడ్‌, సాకే కుళ్లాయస్వామి, చింతకుంట మధు, థామస్‌, జావెద్‌, ఉదయ్‌, రాధాయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబుకు కనువిప్పు

కలిగించేందుకే ‘అన్నదాత పోరు’

రైతన్నలకు మద్దతుగా

ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement