
ప్రజారోగ్యంతో కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ నిర్వాహకుల చెలగాట
హిందూపురం: ప్రజారోగ్యంతో కూల్‌డ్రింక్స్ ఏజెన్సీ నిర్వాహకులు చెలగాటమాడారు. కాలం చెల్లిన కూల్ డ్రింక్ బాటిళ్లను రోడ్డు పక్కన నిర్లక్ష్యంగా పడేయడంతో అటుగా వెళుతున్న వారు, స్థానికులు, చిన్నారులు గుర్తించి కేసులకు కేసులే ఎత్తుకెళ్లారు. చిన్నారులు కొందరు అక్కడే బాటిళ్ల మూతలు తీసి కూల్ డ్రింక్స్ తాగుతూ కనిపించారు. కాగా, కాలం చెల్లిన కూల్‌డ్రింక్స్ విషపూరితంగా మారుతాయని, వాటిని సేవిస్తే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏజెన్సీ నిర్వాహకులు నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేయడం వివాదాస్పదమైంది.