
జేఎన్‌టీయూ ప్రొఫెసర్లకు అవార్డులు
అనంతపురం: ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తమ టీచర్ల అవార్డులకు జేఎన్‌టీయూ (ఏ)లో పనిచేస్తున్న ముగ్గురు ప్రొఫెసర్లు ఎంపికయ్యారు. ఎంపికై న కంప్యూటర్ సైన్సెస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి. ఈశ్వరరెడ్డి, కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్.శారద, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓం ప్రకాష్‌ను వర్సిటీ ఉద్యోగులు అభినందించారు. శుక్రవారం విజయవాడలో జరిగే కార్యక్రమంలో అవార్డులను వీరు అందుకోనున్నారు. కాగా, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి తాజాగా నిరాశ ఎదురైంది. ఈ దఫా ఏ ఒక్క ప్రొఫెసర్ సైతం బెస్ట్ టీచర్ అవార్డుకు ఎంపిక కాలేదు. ఎస్కేయూలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆంజినేయులు, ప్రొఫెసర్ రమణ పేర్లు ప్రతిపాదించినా.. ప్రభుత్వం నిర్ధేశించిన స్కోరు లేకపోవడంతో తిరస్కరణకు గురయ్యారు.
డాక్టర్ ఎస్.శారద
డాక్టర్ ఓంప్రకాష్
ప్రొఫెసర్ ఈశ్వరరెడ్డి

జేఎన్‌టీయూ ప్రొఫెసర్లకు అవార్డులు

జేఎన్‌టీయూ ప్రొఫెసర్లకు అవార్డులు