
రూ.లక్ష పలికిన వినాయకుడి లడ్డూ
ఉరవకొండ: స్థానిక మాస్టర్ సీవీవీ నగర్‌లో శ్రీ విద్యా వినాయక ఉత్సవ సమితి అధ్వర్యంలో కొలువుదీర్చిన గణనాథుడి లడ్డూ రికార్డు స్థాయిలో రూ.లక్ష పలికింది. గురువారం ఉత్సవ సమితి ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు. ఆదోనికి చెందిన కురుబ రాజేష్ రూ.లక్ష పాడి లడ్డ్డూను దక్కించుకున్నాడు. స్వామి వారి వెండి గొలుసు కురుబ రంజిత్, కురుబ గోపి రూ.26,100, వెండి విగ్రహన్ని గుండ్లపల్లి తిమ్మారెడ్డి రూ.22వేలు, కలశాన్ని కురుబ సాయినాథ్ రూ.20,116, వెండి కడియాన్ని శ్రావణ్ రూ. 16,500, వెండి ఉంగరాన్ని కిరణ్‌స్వామి రూ.5,600, శాలువను రాజేష్ రూ.4,100కు దక్కించుకున్నారు. అనంతరం వినాయక ప్రతిమలను భారీ ఊరేగింపుగా నిమర్జనానికి తరలించారు.
బుగ్గ రామలింగేశ్వరుడిని తాకిన సూర్యకిరణాలు
తాడిపత్రి రూరల్: పట్టణంలోని పార్వతీ సమేత బుగ్గ రామలింగేశ్వరస్వామిని గురువారం సాయంత్రం సూర్యకిరణాలు తాకాయి. ఏటా రెండు పర్యాయాలు స్వామి వారిని సూర్యకిరణాలు తాకుతాయని ప్రధాన అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామి వారిని అర్చకులు ప్రత్యేక పూలమాలలతో అలంకరించి పూజలు చేశారు. స్వామి వారిని తాకిన సూర్య కిరణాలను కనులారా చూసిన భక్తులు పరవశించిపోయారు.

రూ.లక్ష పలికిన వినాయకుడి లడ్డూ