
రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపిక
అనంతపురం ఎడుకేషన్/కల్చరల్: రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ అవార్డులకు జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపికయ్యారు. ఆత్మకూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో బయాలజీ టీచర్‌గా పనిచేస్తున్న శైలజ, గుత్తి మండలం అబ్బెదొడ్డి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్న శ్రీనివాసులు, పామిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అరు ణను ప్రభుత్వం అవార్డులకు ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5న విజయవాడలో జరగనున్న గురుపూజోత్సవం కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా వీరు అవార్డులు అందుకోనున్నారు.
● అవార్డుకు ఎంపికై న బయాలజీ టీచర్ శైలజ 1996లో పోస్టుకు ఎంపికయ్యారు. అనంతపురం రూరల్ విద్యారణ్యనగర్ పాఠశాలలో వృత్తి జీవితం ప్రారంభించారు. చిన్నారుల్లో అంతర్లీనంగా ఉండే ప్రతిభా పాటవాలను గుర్తిస్తూ ప్రోత్సహిస్తున్నారు. గతంలో ఉరవకొండ పాఠశాలలో శైలజ పని చేసిన సమయంలో విద్యార్థులు రెండు సార్లు జాతీయ స్థాయి సైన్సు కాంగ్రెస్‌కు ఎంపిక కావడం గమనార్హం. గంగవరంలో పని చేసిన సమయంలోనూ విద్యార్థులు సైన్సు కాంగ్రెస్‌కు వెళ్లినట్లు తెలిసింది. శైలజకు రాష్ట్ర స్థాయి ఉత్తమ టీచర్ రావడం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు.
● రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికైన ఫిజిక్స్ టీచర్ శ్రీనివాసులు 1996లో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 16 ఏళ్లుగా డిజిటల్ పద్ధతిలో తరగతులు బోధిస్తున్నారు. 15 ఏళ్లు రిసోర్స్ పర్సన్‌గా కూడా విధులు నిర్వర్తించారు. అవార్డుకు ఎంపికై న శ్రీనివాసులుకు పలువురు టీచర్లు అభినందనలు తెలిపారు.
● పామిడి మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అరుణ విద్యార్థులను అమ్మలా ఆదరిస్తూ బోధిస్తున్నారు. తరగతి గదిలోనే కాకుండా హాస్టల్స్‌ను విజిట్ చేస్తూ సాదకబాధకాలు తెలుసుకుంటున్నారు. అవార్డు తనలో బాధ్యత పెంచిందని అరుణ ఈ సందర్భంగా తెలిపారు.
అరుణ శ్రీనివాసులు శైలజ

రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపిక

రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులకు ఎంపిక