
జిల్లా అంతటా బుధవారం ఉష్ణోగ్రతలు స్థిరంగా నమోదయ్యాయి. ఆ
డాక్యుమెంటు రైటర్ అసిస్టెంట్‌పై చేయిచేసుకున్న వైనం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఏసీబీ సీఐ హమీద్‌ఖాన్ రెచ్చిపోయారు. ఓ డాక్యుమెంటు రైటర్ అసిస్టెంట్ పై చేయి చేసుకున్నారు. సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది తెలిపిన మేరకు.. ఎనీవేర్ (ఎక్కడైనా) రిజిస్ట్రేషన్ పరిశీలనకు ఏసీబీ అధికారులు బుధవారం స్థానిక అనంతపురం రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు. అంతకు రెండు రోజులు ముందే ఏసీబీ సీఐ హమీద్‌ఖాన్ ఒక స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఇందు కోసం డాక్యుమెంటు రైటర్ మురళి రూ.6,500 తీసుకున్నారు.
ఈ క్రమంలోనే బుధవారం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లిన హమీద్‌ఖాన్ డాక్యుమెంటు రైటర్‌కు ఫోన్ చేసి తన దగ్గరే ఎక్కువగా డబ్బు తీసుకుంటారా అని గద్దించారు. ఇందుకు డాక్యుమెంట్ రైటర్ మురళి బదులిస్తూ డాక్యుమెంటును బట్టి చార్జీలుంటాయని సమాధానమిచ్చారు. దీంతో కోపోద్రిక్తుడైన సీఐ హమీద్‌ఖాన్ అక్కడే ఉన్న డాక్యుమెంటు రైటర్ అసిస్టెంట్ కార్తీక్‌పై చేయి చేసుకున్నారు. ఏసీబీ సీఐ దురుసు ప్రవర్తనపై డాక్యుమెంటు రైటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైటర్ నచ్చకపోతే వేరే దగ్గర చేయించుకోవాలి గానీ, ఎక్కువ తీసుకున్నారని కొట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.