
నేమ్ బోర్డులో వైఎస్సార్ పేరు తొలగింపు
● మండిపడ్డ వైఎస్సార్ సీపీ శ్రేణులు
● గుంతకల్లు మార్కెట్ యార్డ్ వద్ద
పెద్ద ఎత్తున ఆందోళన
గుంతకల్లు: స్థానిక మార్కెట్ యార్డులోని రైతు బజార్ కేంద్రం నేమ్ బోర్డులో వైఎస్సార్ పేరు తొలగించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. దీనిపై వైఎస్సార్ సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. మార్కెట్ యార్డు చైర్మన్ సుగాలి లక్ష్మీదేవి భర్త మృతనాయక్ చెప్పడంతోనే వైఎస్సార్ పేరు తొలగించినట్లు యార్డు సెక్రటరీ బాలాజీరావు పేర్కొనడంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతిరెడ్డి మాట్లాడుతూ రైతు బాంధవుడిగా పేరుగాంచిన వైఎస్సార్ పేరును తొలగించడం అన్యామన్నారు. ఈ నెల 6న తమ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్నదాతల సమస్యలపై ఉద్యమం చేపడుతున్నామని, అంతలోపు వైఎస్సార్ పేరును నేమ్ బోర్డ్‌లో చేర్చకపోతే మార్కెట్ యార్డును దిగ్బంధిస్తామని హెచ్చరించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ భవానీ మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్ పేరు తొలగించారన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాదిలింగేశ్వరబాబు మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి రాజన్న ఎంతగానో పాటుపడ్డారన్నారు. గుంతకల్లు మార్కెట్ అభి వృద్ధికి చర్యలు తీసుకున్నారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో యార్డులో షెడ్లు ఏర్పాటు చేశారని, డ్రైనేజీ సమస్య పరిష్కరించారని గుర్తు చేశారు. 6వ తేదీలోపు వైఎస్సార్ పేరును చేర్చకపోతే మార్కెట్‌యార్డును దిగ్బంధిస్తామని హెచ్చరించి ఆందోళన విరమించారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ జింకల రామాంజినేయులు, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు ఆర్.బాబు రావు,అబ్దుల్‌బాసిద్, రంగనాయకులు, కొనకొండ్ల అంజి, బావన్న, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఎస్‌వీఆర్ మోహన్, కౌన్సిలర్లు లింగన్న, సమోబాషా, జేసీబీ చాంద్‌బాషా, నీలావతి, మున్సిపల్ వింగ్ జిల్లా అధ్యక్షుడు సుంకప్ప, నాయకులు హరి, గోవింద్‌నాయక్, సాంబ, మౌలా, ఆరీఫ్, మల్లారెడ్డి, షాబుద్దీన్, పవన్, ఆనంద్, శివాజీ, నాగాంజినేయులు పాల్గొన్నారు.