
లక్ష్యాలకు అనుగుణంగా ‘ఉపాధి’
రాప్తాడు రూరల్: లక్ష్యాలకు అనుగుణంగా ఉపాధి పనులు చేపడుతూ సమగ్ర గ్రామీణాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం అనంతపురం రూరల్ మండలం చియ్యేడు గ్రామంలో ఆయన పర్యటించారు. ఉపాధి హామీ పథకం కింద రూ. 2.30 లక్షల నిధులతో నిర్మించిన గోకులం షెడ్డును ప్రారంభించారు. అనంతరం అక్కడే కంపోస్ట్ పిట్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వద్ద కలెక్టర్ మొక్కలు నాటారు. ఎస్‌డబ్ల్యూపీసీ కేంద్రానికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని, నీటి సౌకర్యం కల్పించాలని, వర్మీ కంపోస్ట్ అమ్మకాలు చేపట్టాలని ఆదేశించారు. అక్కడే నాడప్ ఫిట్స్‌ను ప్రారంభించిన అనంతరం ఎండోమెంట్ భూమిని పరిశీలించారు. రూ. 35 వేలతో నిర్మించిన పశువుల నీటి తొట్టెను ప్రారంభించారు. కలెక్టర్ వెంట సర్పంచ్ టి.గంగాధర్ రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శైలజ, డీపీఓ నాగరాజునాయుడు, జెడ్పీ సీఈఓ శివశంకర్, డ్వామా పీడీ సలీం బాషా, తహసీల్దార్ మోహన్ కుమార్, ఎంపీడీఓ దివాకర్, సచివాలయ ఉద్యోగులు ఉన్నారు.
కలెక్టర్ వినోద్ కుమార్