
సీ్త్ర శక్తికి తప్పని నిరీక్షణ
గుంతకల్లు/ఆత్మకూరు: కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నరకం చూపుతోంది. పొరుగున ఉన్న కర్ణాటక ప్రాంతానికి వెళ్లే అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణం లేదంటూ కండక్టర్లు స్పష్టం చేస్తుండడంతో గంటల తరబడి బస్టాండులో పడిగాపులు కాయక తప్పడం తప్పడం లేదు. గుంతకల్లు–బళ్లారి మార్గంలోని పెంచలపాడు, గడేకల్లు, డోనేకల్లు గ్రామాల మహిళలకు ఉచిత ప్రయాణ యోగం దక్క లేదు. రోజూ ఈ ప్రాంత ప్రజలు ఏదో ఒక పనిపై గుంతకల్లుకు రాకపోకలు సాగిస్తుంటారు. దీంతో మహిళా ప్రయాణికులు సైతం తప్పని పరిస్థితుల్లో టికెట్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అలాగే గుత్తి–గుంతకల్లు–బళ్లారి, తాడిపత్రి–గుత్తి–గుంతకల్లు–బళ్లారి అంతర్రాష్ట్ర సర్వీసు బస్సులో గుంతకల్లు నుంచి గుత్తి, తాడిప్రతి వెళ్లాలన్నా ఈ పథకం వర్తించడం లేదు. కనీసం ఆంధ్ర సరిహద్దు నుంచైనా అంతర్రాష్ట్ర సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని మహిళ ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై గుంతకల్లు ఆర్టీసీ డిపో మేనేజర్ గంగాధర్‌ను వివరణ కోరగా అంతర్రాష్ట్ర సర్వీసులకు సీ్త్ర శక్తి పథకం వర్తించదని స్పష్టం చేశారు.
గంటల తరబడి పడిగాపులు
అనంతపురం – బళ్లారి మార్గంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి ఆది, మంగళవారాల్లో ఆత్మకూరు మండలం పంపనూరు క్షేత్రానికి భక్తులు పోటెత్తుతుంటారు. ఇందులో అధిక సంఖ్యలో మహిళా భక్తులే ఉంటున్నారు. ఉన్న అరకొర ఎక్స్‌ప్రెస్ బస్సులకు అంతర్రాష్ట్ర సర్వీసు అని బోర్డు పెడుతున్నారు. దీంతో గంటల తరబడి పంపనూరు బస్టాఫ్ వద్ద మహిళా భక్తులకు పడిగాపులు కాయక తప్పడం లేదు. మాములు రోజుల్లో కాకపోయినా... ఆది, మంగళవారాల్లో ఆత్మకూరు మీదుగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని పలువురు భక్తులు కోరుతున్నారు.
అంతరాష్ట్ర సర్వీసుల్లో ‘సీ్త్ర శక్తి వర్తించదు’
గంటల తరబడి బస్టాండ్‌లోనే మహిళల పడిగాపులు

సీ్త్ర శక్తికి తప్పని నిరీక్షణ

సీ్త్ర శక్తికి తప్పని నిరీక్షణ