
ప్రయోజనం లేదు
సామాన్య, మధ్య తరగతి ప్రజలకు రిజిస్టర్ పోస్టు ఎంతో ఉపయోగకరం. తక్కువ ఖర్చుతో విలువైన డాక్యుమెంట్లను పంపించేవారం. రిజిస్టర్ పోస్టును రద్దు చేసి స్పీడ్ పోస్టులో కలపడం దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలపై భారం వేయడాన్ని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి.
– సాయిపల్లవి, చిరుద్యోగి, అనంతపురం
ప్రైవేట్ సంస్థలకు లబ్ధి చేసేందుకే..
కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయమూ కార్పొరేటర్లకు అనుకూలంగా ఉంటున్నాయి. తాజాగా ఎన్నో ఏళ్ల తరబడి కొనసాగుతూ వస్తున్న రిజిస్టర్ పోస్టు రద్దు చేయడం క్షమించరానిది. ప్రైవేట్ కొరియర్ సంస్థలకు లబ్ధి చేకూర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు మంచిది కాదు.
– రహత్ బాషా, మెడికల్ రెప్, అనంతపురం

ప్రయోజనం లేదు