
టీబీ డ్యాం @ 80 టీఎంసీలు
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయంలో 80 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. ఆదివారం జలాశయంలోకి 23,938 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఈ క్రమంలో 2 క్రస్ట్ గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 23,900 క్యూసెక్కుల నీటిని నదికి వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 1,633 అడుగుల నీటి నిల్వకు గాను 1,626.06 అడుగులకు నీరు చేరు కుంది. ఇన్‌ఫ్లో 23,938 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 23,900 క్యూసెక్కులుగా నమోదవుతోంది. ఇదే క్రమంలో ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద హెచ్చెల్సీలో 1,240 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.
అలరించిన సంగీత కచేరీ
ప్రశాంతి నిలయం: పర్తియాత్రలో భాగంగా జోన్ –6 దేశాలైన యూరప్, కెనడా దేశాల భక్తులు ఆదివారం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తికి విచ్చేశారు. సాయంత్రం సాయికుల్వంత్ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధి చెంత సంగీత కచేరీ నిర్వహించారు. సత్యసాయిని కొనియాడుతూ సాగిన సంగీత కచేరీ భక్తులను అలరించింది.

టీబీ డ్యాం @ 80 టీఎంసీలు