
స్వచ్ఛమైన స్నేహం
అనంతపురానికి చెందిన టీఎల్ శారద, ఝాన్సీలది స్వచ్ఛమైన స్నేహ బంధం. వీరి వయసు 60 ఏళ్లు పైబడింది. శారదా మునిసిపల్ హైస్కూల్లో 6వ తరగతి చదివే సమయంలో ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇద్దరి జీవితాలలో జరిగే శుభ, అశుభాలన్నింటిలో రెండు కుటుంబాల వారు ఒకరికొకరు తోడుగా ఉంటూ మైత్రీబంధాన్ని ఆస్వాదిస్తున్నారు. మరో విశేషమేమంటే స్నేహాన్ని బంధుత్వంగానూ మార్చుకున్నారు. ‘స్నేహమంటే ఇతరుల కోసం ఆలోచించేదేనని అనుకున్నాను కాబట్టే ఇన్నేళ్లయినా పొరాపొచ్చలు రాలేదు’ అని ఇటీవలే టీచర్‌గా ఉద్యోగ విరమణ చేసిన శారద తెలిపారు.