
భారత సైన్యానికి ఏటా రూ.10 లక్షల విరాళం
అనంతపురం కార్పొరేషన్: తమ కుమారుడు ఆలూరు విరాట్ పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా భారత సైన్యానికి ఆలూరు ఫౌండేషన్ ద్వారా రూ.10 లక్షల విరాళం అందిస్తామని వైఎస్సార్‌సీపీ ఎన్‌ఆర్‌ఐ వింగ్ కో ఆర్డినేటర్ ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు పేర్కొన్నారు. శనివారం కుమారుడి పుట్టిన రోజును పురస్కరించుకుని నార్పలలోని చెన్నకేశవ వృద్ధాశ్రమానికి రూ.లక్ష, బెంగళూరులోని బన్నేరుఘట్ట జూలో ఐదు జంతువులను దత్తత తీసుకుని వాటి పరిరక్షణకు రూ.లక్ష అందజేసినట్లు పేర్కొన్నారు. ఇటీవలే భారత సైన్యానికి రూ.10 లక్షల విరాళం అందజేసినట్లు వెల్లడించారు. పదేళ్లుగా విరాట్ పుట్టిన రోజు సందర్భంగా శింగనమల నియోజకవర్గంలో, కోవిడ్ సమయంలో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.