
●స్నేహ హస్తం.. స్ఫూర్తి మంత్రం
అనంతపురంలోని శ్రీపొట్టి శ్రీరాములు హై స్కూల్లో 1984 సంవత్సరంలో చదువుకున్న వారంతా ఒక బాస చేసుకున్నారు. హైస్కూలు వీడి వెళ్లినా అందరూ కలుస్తుండాలని. ఎన్ని సమస్యలు ఉన్నా వీలైనప్పుడల్లా కలవాలని. అలా కలయిక మొదలైంది. 2012లో ప్రత్యేకంగా ఒక గ్రూపు ఏర్పాటు చేసుకుని ప్రతినెలా కృష్ణకళామందిరంలో సమావేశమై సాదకబాధకాలు చర్చించుకుంటున్నారు. ఈ గ్రూపులో వందమందికి పైగా ఉన్నారు. వీరిలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మిగతా స్నేహితులంతా స్పందించి సాయం అందిస్తూ.. నేటికీ అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని గ్రూపు నిర్వాహకులు యమ్మనూరు చంద్రశేఖర్, జయసింహ, రామకృష్ణ చెబుతున్నారు.