
పాతకొత్త చెరువులో నెమళ్ల సందడి
గుంతకల్లు రూరల్: మండలలోని పాతకొత్త చెరువు (పీకేచెరువు) గ్రామంలో నెమళ్ల సందడి నెలకొంది. స్థానికులకు అలవాటు పడిన కొన్ని నెమళ్లు తరచూ ఆహారం కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి సాయంత్రానికి గ్రామానికి చేరుకుంటున్నాయి. వీటికి తోడు అటవీ ప్రాంతంలోని నెమ్మళ్లు సైతం వచ్చి వెళుతుండడంతో గ్రామంలో ఎటు చూసినా నెమళ్లు కనిపిస్తున్నాయి. అంతేకాక వ్యవసాయ పనులు, గొర్రెల మేపు తదితర పనుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్లిన రైతులు అక్కడ నెమలి గుడ్లు కనిపిస్తే తెచ్చి ఇంట్లో కోళ్ల కింద పొదిగేసి నెమళ్ల సంతతి పెరిగేలా చర్యలు తీసుకున్నారు.